ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రీ.శ.1918లో స్థాపించబడింది. ఉర్దూబోధనా భాషగా వెలసిన ఈ విశ్వవిద్యాలయం దేశీయ భాషలలో విద్యా బోధన నిర్వహించే విద్యాసంస్థగా భారతదేశంలో కీర్తిని పొందింది. ఆ తరువాత 1948లో ఆంగ్లభాషను బోధనా భాషగా స్వీకరించి, దేశంలోని విశ్వవిద్యాలయాలతో పాటు ఉన్నత విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ 1919లో పనిచేయటం ప్రారంభించింది. అప్పటినుండి శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆచార్యుల పర్యవేక్షణలో అధ్యాపకుల, అధికారుల అండదండలతో తెలుగు శాఖ మూడు పూవులారుకాయలుగా అభివృద్ధిచెందుతూ వచ్చింది.
Copyright © ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ 2019. Home | About Us | Profile | Photo Gallery | Contact Us